పెళ్లంటే ఆనందం కాదు..అదొక హార్డ్ వర్క్...
on Jan 8, 2024
.webp)
కొత్తగా పెళ్ళైన వాళ్లకు అనసూయ ఇచ్చిన టిప్ ఇదే.. పెళ్లి గురించి కూడా చాలా కొత్తగా తనదైన స్టయిల్లో కుండ బద్దలు కొట్టి మరీ చెప్పింది. "బోర్ గా ఉంది కాసేపు మాట్లాడుకుందాం" రండి రండి అనేసరికి నెటిజన్స్ ఇక దొరికిందే ఛాన్స్ అంటూ ఈ వీకెండ్ లో అనసూయను వాళ్ళ వాళ్ళ ప్రశ్నలతో షూట్ చేశారు. అందులో ఒక వెరైటీ ప్రశ్న కనిపించింది. ఒక లేడీ ఈ ప్రశ్న అడిగినట్టు అర్ధమవుతోంది.."కొత్తగా పెళ్లయ్యింది. ఇప్పుడు ఈ మేల్ ఈగోని ఎలా భరించాలి..ఎలా డీల్ చేయాలి..కొత్తగా పెళ్ళైన వాళ్లకు ఏవైనా టిప్స్ చెప్పరాదు" అని అడిగేసరికి "నిజం చెప్పాలంటే చాలా ఇంటరెస్టింగ్ క్వశ్చన్ ఇది. నాకు తెలుసు మీకు చాలా బాధగా ఉంటుంది. ముందుగా నేను చెప్పేది ఏంటంటే పెళ్లి అనేది ఒక హార్డ్ వర్క్ లాంటిది. అందరూ అనుకున్నట్టు ఆ వెరీ హ్యాపీ మారీడ్ లైఫ్ అన్నట్టుగా అస్సలు ఉండదు.
అన్ని రకాల సమ్మేళనం ఈ పెళ్లి. కానీ అర్ధం చేసుకోవడానికి ప్రేమ, సమయం చాలా అవసరమవుతాయి. ఒకరికి ఒకరు కలిసి పనుల్లో సాయం చేసుకోవాలి. ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో మగాళ్లు బయటపడ్డారు..కానీ ప్రేమతో వాళ్ళను మార్చొచ్చు..పెళ్లి నిజంగా ఒక హార్డ్ వర్క్ లాంటిది. నిజంగా లవ్ చేస్తే అస్సలు వదలొద్దు" అని చెప్పింది. "మీమ్స్ ఇంకా ఉన్నాయా..నేను వాటిని పట్టించుకోను..టైం వేస్ట్ పిచ్చ లైట్ తీసుకున్నా..ట్రోల్ల్స్ చేసేవాళ్లను పట్టించుకోవడం మానేసాను. ఆ కంపు నాకు అంటకుండా చూసుకుంటున్నాను. నా మూవీస్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ గురించి నన్నే అడిగారా...పడుకోవాలి...బాడీ హైడ్రేట్ గా ఉండాలి. సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. అన్ని తెలుసు కానీ మనం చెయ్యం..ఎం చేసిన డార్క్ సర్కిల్స్ రాకూడదు కదా...ముసలితనం ఎవరికైనా వస్తుంది.. ముసలితనంలో కూడా ఒక బ్యూటీ ఉంది. మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి.. ఇంకా స్ట్రాంగ్ అవుతాం..నా వయసు 39 ఏళ్ళు..నా లక్ష్యం ఆరోగ్యంగా ఉండడం, ఎం చేయాలనుకుంటున్నానో అది చేయడం. అంతేకాని యంగ్, ఓల్డ్ అనేది ఏమీ ఉండదు" అంటూ ఇలా నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చి ఈరోజు బై బై అని చెప్పింది అందాల అనసూయ..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



